
నేటి నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
మురళీనగర్: పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లమో సాంకేతిక కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి శనివారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం విశాఖ ఉమ్మడి జిల్లాలో ఆరు హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్ (గైస్), పెందుర్తి, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఈ హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లి తమ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి కౌన్సెలింగ్ జరుగుతుంది.
తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు
కింది ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ కోసం తీసుకురావాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వాటిని తిరిగి తీసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన రసీదు, పాలిసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, 10వ తరగతి మార్కుల మెమో, 4–10వ తరగతుల వరకు స్టడీ సర్టిఫికెట్ (లేదా) 7 సంవత్సరాల నివాస ధ్రువపత్రం, టీసీ, ఆదాయ ధ్రువపత్రం (2022 జనవరి 1 లేదా ఆ తర్వాత జారీ చేసినది), కుల ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ 2025–26, పీడబ్ల్యూడీ (వికలాంగుల) సర్టిఫికెట్, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ జారీ చేసిన క్యాప్ సర్టిఫికెట్, ఆంగ్లో–ఇండియన్ సర్టిఫికెట్, ఎన్‌సీసీ సర్టిఫికెట్, స్పోర్ట్స్ సర్టిఫికెట్, స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికెట్.
ఇతర కేటగిరీల విద్యార్థులకు కౌన్సెలింగ్ షెడ్యూల్
(విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద)
జూన్ 25 : ఎన్‌సీసీ 1–40,000 ర్యాంకులు, పీడబ్ల్యూడీ 1 – చివరి ర్యాంకు
26 : స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 1 – 60,000 ర్యాంకులు, ఎన్‌సీసీ 40,001 – 80,000 ర్యాంకులు
27 : స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 60,001 – చివరి ర్యాంకు, ఎన్‌సీసీ 80,001 – చివరి ర్యాంకు
28 క్యాప్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఆంగ్లో ఇండియన్స్ (1–చివరి ర్యాంకు వరకు)
గైస్, పాలిటెక్నిక్ కళాశాలల్లో ర్యాంకుల వారీగానిర్దేశించిన కౌన్సెలింగ్ వివరాలు
తేదీ కెమికల్ ఇంజినీరింగ్ (గైస్) పాలిటెక్నిక్
జూన్ 21 1 – 7,500 7,501 – 15,000
22 15,001 – 23,500 23,501 – 32,000
23 32,001 – 41,000 41,001 – 50,000
24 50,001 – 59,000 59,001 – 68,000
25 68,001 – 77,000 77,001 – 86,000
26 86,001 – 95,000 95,001 – 1,04,000
27 1,04,001 – 1,12,000 1,12,001 – 1,20,000
28 1,20,001 – 1,27,000 1,27,001 – చివరి ర్యాంకు
ర్యాంకుల వారీగాసర్టిఫికెట్ల వెరిఫికేషన్ షెడ్యూల్
తేదీ ర్యాంకులు
జూన్ 21 1 – 15,000
22 15,001 – 32,000
23 32,001 – 50,000
24 50,001 – 68,000
25 68,001 – 86,000
26 86,001 – 1,04,000
27 1,04,001 – 1,20,000
28 1,20,001 – చివరి ర్యాంకు
వెబ్ ఆప్షన్స్ షెడ్యూల్
జూన్ 25, 26 1 – 50,000 ర్యాంకులు
27, 28 50,001 – 90,000 ర్యాంకులు
29, 30 90,001 – చివరి ర్యాంకు వరకు
జూలై 1 ఆప్షన్ల మార్పిడి
జూలై 3 సీట్ల కేటాయింపు