ఉజ్వల భవిష్యత్తుకు బాటలు
ఇక్కడ శిక్షణ పొందిన పలు రాష్ట్రాలకు చెందిన డిఫెన్స్ ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రాంతాలు, పట్టణాల్లో విజయవంతంగా ఉపాధి పొందుతున్నారు. కొందరు విశాఖ నగరంలోని పలు హోటళ్లు, గీతం వంటి యూనివర్సిటీల్లో ఉద్యోగాల్లో స్థిరపడగా, మరికొందరు ఇతర రాష్ట్రాల్లో సొంతంగా హోటళ్లు, పార్లర్లు కూడా నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు ఒడిశాకు చెందిన తుస్టి అనే ఆర్మీ ఉద్యోగి ఇక్కడ శిక్షణ పొందారు. పదవీ విరమణ తర్వాత తన పేరుతోనే ఒక పార్లర్‌ను విజయవంతంగా నడుపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో కొనసాగుతున్న ఈ ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్.. అటు నిరుద్యోగ యువతకు, ఇటు దేశ సేవలో తరించిన సైనికులకు ఉపాధి మార్గాలను చూపుతూ ఆదర్శంగా నిలుస్తోంది.
ఆరిలోవ: నగరంలోని ప్రభుత్వ ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్ ప్రత్యేక గుర్తింపు పొందింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏకై క ఇన్‌స్టిట్యూట్ ఇది. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతో మంది యువత దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించడంతో పాటు స్వయం ఉపాధి మార్గాల్లో స్థిరపడ్డారు. అలాగే ఈ ఇన్‌స్టిట్యూట్‌లో రక్షణ రంగ ఉద్యోగులకు సైతం వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తూ వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. విశాఖపట్నం రూరల్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో 1986లో ఈ ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటైంది. అప్పటి నుంచి వేలాది మంది నిరుద్యోగ పేద యువతకు అండగా నిలుస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన యువతీ యువకులకు వంటలు, హాస్పిటాలిటీ, బేకరీ వంటి పలు విభాగాల్లో శిక్షణ ఇచ్చి, వారిని సొంతకాళ్లపై నిలబడేలా తీర్చిదిద్దుతోంది.
రక్షణ రంగ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ
2017 నుంచి ఈ ఇన్‌స్టిట్యూట్ తన సేవల పరిధిని మరింత విస్తరించింది. కేంద్ర ప్రభుత్వ చొరవతో డిఫెన్స్ రంగంలోని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగులకు వంటల తయారీలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఉద్యోగ విరమణకు ఆరు నెలల గడువు ఉన్న వారిలో ఆసక్తి కలిగిన వారిని ఎంపిక చేసి, వారికి ఈ శిక్షణ అందిస్తున్నారు. డైరెక్టర్ జనరల్ రీసెటిల్‌మెంట్(డీజీఆర్) ఆధ్వర్యంలో ఐఐటీ, ఎన్‌ఐటీ, ఎఫ్‌సీఐ వంటి సంస్థలతో పాటు ఫుడ్‌క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్‌లో కూడా ప్రీ రిలీజ్ కోర్సు(పీఆర్‌సీ)లలో భాగంగా ఈ శిక్షణను అందిస్తున్నారు. ఈ శిక్షణకు సంబంధించిన పూర్తి వ్యవహారాలను, ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇక్కడ ఉత్తర, దక్షిణ భారత వంటకాలతో పాటు హాస్పిటాలిటీ, బేకరీ, టూరిజం (హోటల్ మేనేజ్‌మెంట్) వంటి విభాగాల్లో నిష్ణాతులైన ఇన్‌స్ట్రక్టర్ల ద్వారా తర్ఫీదు ఇస్తున్నారు. 2017 నుంచి ఇప్పటివరకు 24 బ్యాచ్‌లకు శిక్షణ పూర్తి చేశారు. ప్రతీ బ్యాచ్ మూడు నెలల కాలపరిమితితో నడుస్తుంది. శిక్షణ అనంతరం పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ అందజేస్తారు. ఈ సర్టిఫికెట్‌తో వారు పదవీ విరమణ అనంతరం స్వయం ఉపాధి పొందడానికి లేదా ఇతర సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించడానికి మార్గం సుగమం అవుతోంది.
పదవీ విరమణ పొందుతున్న సైనికులకు ‘ఫుడ్‌క్రాఫ్ట్’ అండ
మూడు నెలల శిక్షణతో స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు
నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి
డిఫెన్స్ ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు
2017 నుంచి డిఫెన్స్ ఉద్యోగులకు ఫుడ్ క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటివరకు 24 బ్యాచ్‌ల్లో 796 మందికి శిక్షణ అందించి సర్టిఫికెట్లు అందజేశాం. ఇక్కడ శిక్షణ పొందినవారు డిఫెన్స్‌లో రిటైర్ అయిన వెంటనే వివిధ రంగాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. కొందరు సొంతంగా హోటళ్లు, పార్లర్లు నిర్వహిస్తున్నారు. ఇది వారికి చాలా మంచి అవకాశం. ఈ శిక్షణకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.
–కె.వి.రమణ, ప్రిన్సిపాల్, ఫుడ్‌క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్, విశాఖపట్నం
రిటైర్‌మెంట్ అనంతరం నూతన కెరీర్
ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో 2024 బ్యాచ్‌లో ‘డిప్లమో ఇన్ బ్యాంక్విట్ మేనేజ్‌మెంట్’లో మూడు నెలల పాటు శిక్షణ పొందాను. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగ విరమణ అనంతరం గీతం వర్సిటీలో హాస్పిటాలిటీ సర్వీస్‌లో ఉద్యోగంలో చేరాను. ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందడం వల్ల నాకు రిటైర్ అయిన తర్వాత కూడా ఉపాధి లభించింది.
– ఆర్.అనూప్, రిటైర్డ్ ఉద్యోగి, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
శిక్షణ వల్లే సాధ్యమైంది
2024 బ్యాచ్‌లో ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో హాస్పిటాలిటీలో శిక్షణ పొందాను. మూడు నెలల శిక్షణ అనంతరం తిరిగి ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగంలో చేరాను. మూడు నెలలు తర్వాత రిటైర్ అయ్యాను. అనంతరం గీతం యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం లభించింది. ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో పొందిన శిక్షణ వల్లే ఇది సాధ్యమైంది. దీంతో నా కుటుంబాన్ని పోషించుకోవడానికి వేరే చోట ఉద్యోగం కోసం వెతకాల్సిన పని తప్పింది.
– శ్రీకాంత్, రిటైర్డ్ ఉద్యోగి, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
యువతకు ఉపాధి.. యోధులకు భరోసా
యువతకు ఉపాధి.. యోధులకు భరోసా
యువతకు ఉపాధి.. యోధులకు భరోసా
యువతకు ఉపాధి.. యోధులకు భరోసా
యువతకు ఉపాధి.. యోధులకు భరోసా
యువతకు ఉపాధి.. యోధులకు భరోసా