రామజోగయ్య శాస్త్రికి ఆత్రేయ పురస్కారం
రామజోగయ్యశాస్త్రిని సత్కరిస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, తదితరులు
అల్లిపురం: ప్రముఖ సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రికి కవి కుల కిరీటి ఆత్రేయ స్మారక పురస్కారం ప్రదానం చేశారు. ఆచార్య ఆత్రేయ 104వ జయంతి సందర్భంగా ఆత్రేయ స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో బుధవారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో రామజోగయ్య శాస్త్రికి ఆత్రేయ పురస్కారాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ గురువు సిరివెన్నెలను స్ఫూర్తిగా తీసుకుని అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే గీతాలు రాస్తున్న మహోన్నత వ్యక్తి రామజోగయ్య అని కొనియాడారు. కార్యక్రమంలో ఆత్రేయ కళాపీఠం కార్యదర్శి గంటి మురళి, పోర్ట్ ట్రస్ట్ కార్యదర్శి టి.వేణుగోపాల్, ప్రముఖ రచయితలు మా శర్మ, ఎర్రాప్రగడ రామకృష్ణ, బీజేపీ నాయకులు డాక్టర్ సుహాసినీ ఆనంద్, కొణతాల రాజు, చెన్నా తిరుమలరావుపాల్గొన్నారు.


