
కార్యక్రమంలో పాల్గొన్న స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్ బాగ్చీ
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (ఆర్‌ఎంహెచ్‌పీ) ఐకాన్‌ను స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్), డైరెక్టర్ ఆపరేషన్స్ ఇన్‌చార్జ్ అరుణ్ కాంతి బాగ్చీ ప్రారంభించారు. మంగళవారం ఆర్.ఎం.హెచ్.పి కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విభాగం ఉన్నతాధికారులు, ఉద్యోగులతో మాట్లాడారు. విభాగం ఉత్పత్తి గురించి వారితో చర్చించారు. ఉత్పత్తి పెంపునకు అందరూ కృషి చేయాలని కోరారు. సీజీఎం (ఐరన్) ఎన్.వి.స్వామి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తిలో ఆర్.ఎం.హెచ్.పి. విభాగం కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి ఎ.కె.ధావన్, అధికారులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.