
పైలాన్‌ను జాతికి అంకితం చేస్తున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, అమర్‌నాథ్ తదితరులు
బీచ్‌రోడ్డు: జీ–20 సదస్సు చిరకాలం గుర్తుండిపోయేలా వీఎంఆర్డీఏ పార్కులో ఏర్పాటు చేసిన పైలాన్‌ను మంగళవారం రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జాతికి అంకితం చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, వీఎంఆర్డీఏ చైర్‌పర్సన్ అక్కరమాని విజయనిర్మల, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, కలెక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ పి.రాజాబాబు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.