
ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న మేయర్ హరి వెంకట కుమారి, మంత్రి విడదల రజని
గోపాలపట్నం: విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ–20 సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సాయంత్రం 7.05 నిమిషాలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న ఆయన ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాడిషన్ బ్లూ హోటల్‌కు బయలుదేరారు. అక్కడ విదేశీ ప్రతినిధులతో సమావేశమై.. తిరిగి రాడిషన్ బ్లూ నుంచి విశాఖ విమానాశ్రయానికి రాత్రి 9.10 గంటలకు చేరుకున్నారు. 9.21 గంటలకు ప్రత్యేక విమానంతో గన్నవరానికి బయలు దేరారు. నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజని, మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, ఆదిమూలపు సురేష్, ఆర్.కె.రోజా, మేరుగ నాగార్జున, విప్ కరణం ధర్మశ్రీ, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర, వీఎంఆర్డీఏ చైర్‌పర్సన్ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్‌కుమార్, గొల్ల బాబూరావు, కె.భాగ్యలక్ష్మి , చెట్టి ఫాల్గుణ, వెంకటరమణ మూర్తి రాజు, ప్రత్యేక కార్యదర్శులు శ్రీలక్ష్మి, ఎస్.రజిత్ భార్గవ్, కలెక్టర్ మల్లికార్జున, సీపీ సీహెచ్ శ్రీకాంత్, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
