
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌లో గ్రాడ్యుయేట్, డిప్లమో అప్రెంటిస్ చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంగళవారం యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌కు 2020, 2021, 2022లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు 300 మంది, డిప్లమో అప్రెంటిస్‌కు 50 మందిని ఎంపిక చేయనున్నారు. ఏడాది శిక్షణలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9వేలు, డిప్లమో అప్రెంటిస్‌లకు నెలకు రూ.8వేల స్టైఫండ్ అందజేస్తారు. పూర్తి వివరాలకు వైజాగ్ స్టీల్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.