
100 మీటర్ల పరుగులో పాల్గొన్న మహిళలు
విశాఖ స్పోర్ట్స్: డాక్టర్ వైఎస్సార్ హెల్త్‌సైన్సెస్ యూనివర్సిటీ అంతర కళాశాలల అథ్లెటిక్ మీట్ వందమీటర్ల పరుగును మెన్‌లో ఆర్.సురేష్ నాయక్ 11.97 సెకన్లలోనూ, వుమెన్‌లో అకింతా నాయక్ 16.76 సెకన్లలోనూ పూర్తిచేసి విజేతలుగా నిలిచారు. మెన్‌లో వెంకటేష్, సాయిచరణ్, వుమెన్‌లో చరిష్మ, సంజన వరుసగా ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచారు. ఏఎంసీ సెంటినరీ వేడుకల్లో భాగంగా తొలిరోజు మెన్‌కు వంద, 5000 మీటర్లు, షాట్‌పుట్ అంశాల్లో పోటీలు నిర్వహించగా మహిళలకు వంద, 1500 మీటర్లు పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, డిస్కస్ అంశాల్లో పోటీలు నిర్వహించారు. పురుషుల 5000 మీటర్ల పరుగులో వినయ్ కుమార్, సాయిచరణ్‌తేజ్, ప్రవీణ్, షాట్‌పుట్‌లో నేతాజీ, పవన్‌కళ్యాణ్, దివాకర్ రెడ్డి తొలి మూడుస్థానాల్లో నిలిచారు. మహిళల 1500 మీటర్ల పరుగులో కాజల్‌సింగ్, భారతిదేవి, పావని, లాంగ్‌జంప్‌లో గౌతమి, వసుధా, లుబ్నా అఫ్రీన్, షాట్‌పుట్‌లో అంకిత, దీక్షిత, సంజన, డిస్కస్‌త్రోలో సమంత్‌రాయ్, సాయి ఉన్మిళ, మానస తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పోటీలను విజయవాడ సౌత్ ఏసీపీ బి.రవికిరణ్ ప్రారంభించగా ఏఎంసీ ప్రిన్సిపాల్ జి.బుచ్చిబాబు, కేజీహెచ్ సూపరింటెండెంట్ పి.అశోక్‌కుమార్ పాల్గొన్నారు.