విశాఖ స్పోర్ట్స్ : యూత్ ఎఫైర్స్, క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు, వారికి తర్ఫీదునిచ్చిన శిక్షకులకు నగదు పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఏప్రిల్ 30వ తేదీలోగా http://dbtyas-sports.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలని వీడీఎస్‌ఏ చీఫ్ కోచ్ సూర్యారావు తెలిపారు. నింపిన దరఖాస్తులను స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్స్ dbt mis పోర్టల్ ద్వారా సమర్పించాలన్నారు. 2022 ఆగస్టు 11వ తేదీకి ముందు గెలుపొందిన జిల్లా క్రీడాకారులు, శిక్షకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.