
మాట్లాడుతున్న రామారావు
అల్లిపురం: 10 వేల మందికి ఉపాధి లక్ష్యంగా ఎంఎస్‌ఎంఈ డెవ లప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు బీవీ రామారావు వెల్లడించారు. నగరంలోని ఓ హోటల్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లా డారు. సంస్థ ఏర్పాటుకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 110 ఎకరాల స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తాము ఏర్పాటు చేసే కార్పొరేషన్ ద్వారా పరిశ్రమలకు ముడి సరకు సరఫరా చేస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వారు 98666 49369కు కాల్ చేస్తే.. సహకారం అందిస్తామని తెలిపారు.