సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర పన్నుల శాఖ విశాఖపట్నం డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఎ.రాజేశ్వరిని జాయింట్ కమిషనర్ నాగార్జునరావు సస్సెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం సీటీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాజేశ్వరి గత కొద్ది రోజులుగా క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులపై నేరుగా ఫిర్యాదులు చేస్తున్న విషయాలు బహిర్గతమయ్యాయి. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన రాష్ట్ర పన్నుల శాఖ కమిషనరేట్ ఉన్నతాధికారులు.. రాజేశ్వరిపై చర్యలకు ఉపక్రమించాలని జేసీ–1ని ఆదేశించారు. ఈ మేరకు జేసీ–1 నాగార్జునరావు రాజేశ్వరిని సస్పెండ్ చేసినట్లు విశాఖ డివిజన్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.