మహారాణిపేట: వైద్య ఆరోగ్య శాఖ జోన్–1లో నర్సింగ్ గ్రేడ్–2 పోస్టులకు సోమవారం రీజనల్ డైరెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ ఎన్.ఉమాసుందరి కౌన్సెలింగ్ నిర్వహించారు. మూడు పోస్టులకు డీపీసీ ద్వారా ఎంపిక చేశారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(శ్రీకాకుళం)లో హెడ్ నర్సుగా పని చేస్తున్న పి.కామేశ్వరికి ఈఎన్‌టీ ఆస్పత్రిలో గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా, కేజీహెచ్ హెడ్ నర్సుగా పని చేస్తున్న ఎల్.అమ్మన్నను విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా నియమించారు. విశాఖపట్నం ప్రభుత్వ మెంటల్ కేర్ ఆస్పత్రిలో పని చేస్తున్న ఒ.పి.ఎల్.కుమారిని శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్ ఆస్పత్రి గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా నియమించినట్టు ఉమాసుందరి తెలిపారు.