
మాట్లాడుతున్న డీఆర్‌సీ శ్రీనివాసమూర్తి
విశాఖ విద్య: జిల్లాలో ఏప్రిల్ 1, 2 తేదీల్లో యూపీఎస్‌సీ నిర్వహిస్తున్న కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ఆదివారం ప్రధాన కార్యాలయాలకు చేరిందని చెప్పారు. విశాఖలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఏవీఎన్ కళాశాలల్లో రెండు రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించబోమని, సిబ్బంది కూడా తీసుకువెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. పరీక్షలు ఆఫ్‌లైన్‌లో జరుగుతున్నందున పరీక్షా కేంద్రాల్లో బందోబస్తు, విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, వైద్యసదుపాయం వంటి వాటిని ఆయా శాఖాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఏవీఎన్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డా.ఎస్.శోభారాణి, ఎస్.హెచ్.ఎం.సింహాద్రినాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ కె.వెంకటరావు, తపాలా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఈపీడీసీఎల్, జీవీఎంసీల ప్రతినిధులు పాల్గొన్నారు.