
ట్యాబ్‌లు పరిశీలిస్తున్న ఆర్‌జేడీ జ్యోతి కుమారి
విద్యాశాఖ ఆర్‌జేడీ జ్యోతి కుమారి
సీతమ్మధార (విశాఖ ఉత్తర): పదో తరగతి పరీక్షలో శతశాతం ఉత్తర్ణీత సాధించాలని ఆర్‌జేడీ జ్యోతికుమారి అన్నారు. సోమవారం పీఅండ్‌టీ స్కూల్‌ను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. బైజూస్ యాప్ గురించి 8వ తరగతి విద్యార్థులతో చర్చించారు. చదువుపై పూర్తిగా దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం పలు రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌జేడీ మాట్లాడుతూ పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని, అందుకు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. త్వరలోనే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పలు పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నారని, అంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా జగనన్న కిట్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాడు–నేడు పనులు ప్రగతిపై ఆరా తీశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్.ఎం. రాంప్రసాద్, డైట్ లెక్చరర్ బొడ్డేటి రవి, ఉపాధ్యాయులు బెండి ప్రసాదరావు పాల్గొన్నారు.