
కలెక్టరేట్‌లో నల్లబాడ్జీలు ధరించి వర్కు టూ రూల్ పాటిస్తున్న రెవెన్యూ ఉద్యోగులు
మహారాణిపేట: సమస్యల సాధన కోసం రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఇవ్వాలని కోరుతూ రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులూ 19 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రతీ రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు వరకు మాత్రమే కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఏ త్రినాథరావు, కార్యదర్శి సీహెచ్‌వీ రమేష్, నగర కార్యదర్శి రవి శంకర్, ప్రభుత్వ నాల్గో తరగతి ఉద్యోగుల జిల్లా సంఘ అధ్యక్షుడు నమ్మి శ్రీనివాస రావు, ప్రభుత్వ డ్రైవర్లు జిల్లా సంఘ కార్యదర్శి ప్రకాష్ ఆందోళనలో పాల్గొన్నారు.