విశాఖ విద్య: జాతీయ ప్రతిభాన్వేషణ(ఎన్‌ఎంఎంఎస్) పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను అందజేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ ఎస్.మురళీమోహన్ సూచించారు. విద్యార్థుల కుల, ఆదాయ, 7వ తరగతి మార్కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, హాల్ టికెట్, దివ్యాంగ విద్యార్థులు ఉన్నట్లయితే, ఇందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాల జెరాక్స్ ప్రతులను ఈ నెల 29 నాటికి తప్పనిసరిగా అందజేయాలన్నారు. తుది జాబితా విడుదల చేసిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి అభ్యర్థనులను తీసుకోవటం జరగదన్నారు. ఈ విషయంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తగిన శ్రద్ధ తీసుకొని, సకాలంలో ధ్రువీకరణ పత్రాలను అందజేయాలన్నారు.