
విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో చంద్రకళ
విశాఖ విద్య: విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు పాటుపడాలని డీఈవో ఎల్. చంద్రకళ అన్నారు. విశాఖ నగరంలోని గోపాలపట్నం బాలుర, బాలికల జడెప్పీ హైస్కూల్స్, బుచ్చిరాజుపాలెం మున్సిపల్ యూపీఎస్, అక్కిరెడ్డిపాలెం జడ్పె హైస్కూల్‌ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థుల వర్క్‌బుక్స్‌ను పరిశీలించారు. చదువుల్లో విద్యార్థుల ప్రతిభ ఎలా ఉందనేది తెలుసుకునేందుకు కొద్దిసేపు వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా డీఈవో చంద్రకళ మాట్లాడుతూ షెడ్యూల్ మేరకు పాఠ్యాంశాల బోధనను పూర్తి చేయాలన్నారు. విద్యార్థులు చదువుల్లో రాణించేలా ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. భీమునిపట్నం ప్రభుత్వ ఉపాధ్యాయ కళాశాల ప్రిన్సిపాల్ మాణిక్యం నాయుడు పర్యటనలో పాల్గొన్నారు.
డీఈవో చంద్రకళ