అప్రమత్తతే రక్ష | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తతే రక్ష

Apr 14 2026 8:46 AM | Updated on Apr 14 2026 8:46 AM

● మండుటెండలో తిరగరాదు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లరాదు. ● మద్యానికి దూరంగా ఉంటే మంచిది. మద్యం తాగితే డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. ● రోడ్ల వెంబడి విక్రయించే రంగు రంగుల శీతల పానీయాలు తాగరాదు. కలుషిత ఆహారం తినకూడదు. ● సాధ్యమైనంత వరకు మాంసాహారం తగ్గించాలి. రోజూ పండ్లు, కూరగాయలు తీసుకోవటం మంచిది. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ● నీళ్లు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ● రోజుకు కనీసం 12 నుంచి 15 గ్లాసుల నీరు తాగాలి. ● వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, రోజుకు రెండు పూటల స్నానం చేయాలి. ● పలుచటి కాటన్‌ దుస్తులు, లేతవర్ణం దుస్తులు ధరించాలి. ఆహారం మితంగా తీసుకోవాలి. ● ఆరుబయట పడుకుంటే దోమ తెర కచ్చితంగా వాడాలి. ● ఎండలో బయటికి రావాల్సి వస్తే గొడుగు, టోపీ లాంటివి ధరించాలి. ● ఒకవేళ ఎవరైన వడదెబ్బకు గురైతే వెంటనే ప్రథమ చికిత్స నిర్వహించి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ● ప్రథమ చికిత్సలో భాగంగా వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడ ప్రదేశానికి చేర్చాలి. అవసరమైతే చల్లని ఫ్యాన్‌ గాలి తగిలేలా చూడాలి. తడిగుడ్డతో తుడవాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు తుడవటం మంచింది. ● ఉప్పు కలిపిన మజ్జిగ లేదా. ఉప్పు కలిపిన గ్లూకోస్‌, లేదా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు నీటిలో కలిపి తాగించాలి. ● వడదెబ్బకు గురై అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించరాదు. ● వీలైనంత తొందగా పీహెచ్‌సీ లేదా ఇతర ఆస్పత్రులకు తీసుకువెళ్లాలి.

వృద్ధులు, పిల్లల విషయంలోప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు పీహెచ్‌సీల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం వైద్య ఆరోగ్య శాఖ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడాలి ‘సాక్షి’తో జిల్లా వైద్యాధికారిస్వర్ణకుమారి

వికారాబాద్‌: ‘ఎండ తీవ్రత పెరిగిపోయింది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది.. వైద్య ఆరోగ్య శాఖ పరంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం’.. అని డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి అన్నారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిన నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమ వారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ వివరించారు.

అవగాహన కల్పిస్తున్నాం

ఎండ తీవ్రత పెరగడంతో వడగాల్పులు వీస్తున్నాయి. ఎవరైనా వడదెబ్బకు గురైతే చేయాల్సిన ప్రథమ చికిత్స, చేయకూడని పనుల గురించి ఆరోగ్య సిబ్బంది ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో 720 మంది ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు.. ప్రతి ఒక్కరి వద్ద వంద ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 200ల చొప్పున ఉంచాం. జిల్లా వ్యాప్తంగా లక్ష ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాం. ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశంలో కూడా ఓఆర్‌ఎస్‌ ఉండేలా చర్యలు తీసుకున్నాం. రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకపోవడం మంచిది. వృద్ధులు, పిల్లల పట్ల మరింత జాగ్రత్త తీసుకోవాలి. మధుమేహం, రక్తపోటు లాంటి దీర్ఘకాలిక వ్యాధు లు ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గటంల వరకు ఇళ్లలో ఉండాలి. ఒక వేళ బయటికి వెళ్లాల్సి వస్తే గొడులు, టోపీ వంటివి వాడటం మంచిది.

వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన చర్యలు

ఎండ తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

Advertisement
 
Advertisement
Advertisement