బాధితులకు అండగా ఉంటాం
● మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు
● మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి
● మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
తాండూరు: మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు అండగా ఉంటామని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం తాండూరులో మృతుల కుటుంబాలను కలిసి తన వంతు సాయంగా ఒక్కొక్కరికి రూ.20 వేలు అందజేశారు. ఇందిరమ్మ కాలనీకి చెందిన మృతుడు ఖాలీద్ భార్య రేహానా బేగంతో పాటు ముగ్గురు పిల్లలను పరామర్శించారు. అనంతరం వాల్మీకి నగర్‌కు వెంకటమ్మ కుటుంబాన్ని, విశ్వంబర కాలనీకి చెందిన తబస్సుమ్ భర్త మాజీద్‌ను, డ్రైవర్ దస్తగిరి భార్యను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో రోడ్ల పరిస్థితిని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డికి వివరించడం జరిగిందన్నారు. త్వరలో రోడ్లు మెరుగు పడతాయన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రచార కమిటీ సమన్వయకర్త కరణం పురుషోత్తంరావు, సీనియర్ నాయకులు శ్రీనివాస్, రవీందర్, రఘు, భగవాన్, సాకేత్, సిద్దు, ఆదమ్‌ఖాన్,. మాజీ కౌన్సిలర్లు పరిమళ, అబ్దుల్ ఖవి తదితరులు పాల్గొన్నారు.
పరామర్శ
యాలాల: మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున తాను అండగా ఉంటానని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం హాజీపూర్, లక్ష్మీనారాయణపూర్, పేర్కంపల్లి గ్రామాల్లో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన వంత సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.20 వేలు అందించారు. రోడ్డు ప్రమాదం తనను ఎంతగానో కలిచి వేసిందన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తంరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సిద్రాల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


