15న ప్రత్యేక లోక్‌అదాలత్
● అధిక కేసుల రాజీకి న్యాయవాదులు సహకరించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తిసున్నం శ్రీనివాస్‌రెడ్డి
అనంతగిరి: ప్రత్యేక లోక్‌అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు రాజీ పడేలా న్యాయవాదులు సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. గురువారం వికారాబాద్‌లోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 15న ప్రత్యేక లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజీ మార్గమే రాజ మార్గమన్నారు. రాజీ కుదుర్చుకునేందుకు వీలున్న కేసుల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిశోర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జూనియర్ న్యాయమూర్తి శాంతిలత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బస్వరాజు, ఉపాధ్యక్షుడు శంకరయ్య, కార్యదర్శి వెంకట్‌రెడ్డి, న్యాయవాదులు లవకుమార్, గోవర్ధన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కమాల్‌రెడ్డి, సంపూర్ణ ఆనంద్, మాధవరెడ్డి, నాగరాజు, అశోక్‌కుమార్, రవీందర్, వసుంధర, రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


