పది రోజుల్లో పరిహారం అందేలా చూస్తాం
అనంతగిరి: కొడంగల్ పరిధిలోని నేషనల్ హైవే 163 (మహబూబ్‌నగర్ – చించోళి) విస్తరణలో నిర్మాణాలు కోల్పోతున్న వారితో గురువారం కలెక్టర్ ప్రతీక్ జైన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 107 మందికి చెందిన కట్టడాలకు (55,114 చదరపు అడుగులు) నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. కట్టడాల విలువ, బోర్లు, చెట్ల విలువను లెక్కగట్టి పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. బాధితులు అంగీకరిస్తే పది రోజుల్లో పరిహారం అందేలా చూస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, తహసీల్దార్ రాంబాబు, సెక్షన్ సూపరింటెండెంట్ నఫీష్ ఫాతిమా పాల్గొన్నారు.


