 
															భూ సమస్యలు ఉండొద్దు
● రెవెన్యూ రికార్డుల ఆధారంగా సత్వరం పరిష్కరించాలి
● అసిస్టెంట్ కలెక్టర్లు హర్ష్‌చౌదరి, చంద్ర కిరణ్
దుద్యాల్: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను రెవెన్యూ రికార్డుల ఆధారంగా సత్వరం పరిష్కరించాలని అసిస్టెంట్ కలెక్టర్లు హర్ష్ చౌదరి, చంద్ర కిరణ్ ఆదేశించారు. గురువారం వారు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భూ రికార్డులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఆ తర్వాత మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, వంటలు రుచికరంగా ఉండాలని ఆదేశించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిషన్, ఎంఈఓ విజయ రామారావు, డీటీ శివకుమార్, ఆర్‌ఐ నవీన్ కుమార్, ఉపాధ్యాయులు రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
