వికారాబాద్: వికారాబాద్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య మెరుగుకు ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని పాలకులు, అధికారులు చెబుతున్నా కాలనీలు మాత్రం కంపు వీడటం లేదు. రోజూ ఏదో ఒక కాలనీలో మురుగు సమస్య దర్శనమిస్తోంది. చిన్నపాటి వర్షం పడితే చాలు పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. రోడ్లు, వీధులు మురుగు నీటితో నిండిపోతాయి. ప్రజలు నడిచే పరిస్థితి కూడా ఉండదు. వికారాబాద్ నడిబొడ్డున బాబు జగ్జీవన్‌రామ్ చౌరస్తాలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. అవసరాల మేర మురుగు కాలువలు లేవు. వికారాబాద్ పట్టణ జనాభా దాదాపు 80 వేల వరకు ఉంటుంది. జిల్లా కేంద్రం కావడంతో ఆయా ప్రాంతాల నుంచి వివిధ అవసరాల నిమిత్తం రోజూ 20వేల నుంచి 30వేల మంది ఇక్కడికి వస్తుంటారు. మున్సిపల్ పరిధిలో పది చోట్ల మాత్రమే పబ్లిక్ టాయిలెట్లు ఉ న్నాయి. ప్రస్తుత అవసరాలకు ఇవి సరిపోవ డం లేదు. మరో పదిచోట్ల టాయిలెట్లు నిర్మించాల్సి ఉంది. మున్సిపల్ పరిధిలో 33.50 కిలోమీటర్ల మేర సీసీ డ్రైనేజీ, 3.38 కిలోమీటర్ల రాతి డ్రైనేజీ, మరో ఐదు కిలోమీటర్ల కచ్చా డ్రైనేజీ ఉంది. మరో 40 కిలోమీటర్ల సాధారణ డ్రైనేజీ, 60 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అవసరమని అధికారులు అంచనా వేశారు. పట్టణ అవసరాల మేరకు డ్రైజేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు, పారిశుద్ధ్య మెరుగుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పరిగి పట్టణంలోని 5వ వార్డులో ఇళ్ల మధ్య నిలిచిన మురుగు
ప్రతిపాదనల్లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు
జిల్లా కేంద్రంలో పరిస్థితిమరీ అధ్వానం
పట్టించుకోని అధికారులు
ఇబ్బందుల్లో ప్రజలు
డ్రైనేజీ వ్యవస్థ లేక పాట్లు
పరిగి: పరిగి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పడకేసింది. ఎక్కడ చూసినా చెత్తాచెదారం కనిపిస్తోంది. కొన్ని కాలనీలకే చెత్త సేకరణ వాహనాలు వస్తుండటంతో మిగిలిన కాలనీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విధిలేక ప్రజలు వీధుల్లో, ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేస్తున్నారు. పట్టణంలోని 5వ వార్డు, విద్యానగర్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, టీచర్స్‌కాలనీ, ఇంద్రనగర్ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ లేదు. దీంతో మురుగు రోడ్లపై ప్రవహిస్తోంది. ఈ నీటిని ఖాళీ ప్లాట్లలోకి మళ్లించారు. దీంతో ఈగలు, దోమలు వృద్ధి చెంది ప్రజ లు రోగాల బారిన పడుతున్నారు. మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల నుంచి 19 వాహనాలతో రోజుకు 8 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. 78 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నా చెత్త సేకరణ సరిగ్గా లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. కాలనీల్లో చెత్తాచెదారం పేరుకుపోయి కంపుకొడుతున్నాయి. కాలువల్లో వ్యర్థాలు చేరి మురుగు ముందుకు కదలడం లేదు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో చెత్త కుళ్లి ఈగలు, దోమలు వృద్ధి చెందుతున్నాయి. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు
‘చెత్త’మున్సిపాలిటీలు
‘చెత్త’మున్సిపాలిటీలు
‘చెత్త’మున్సిపాలిటీలు