
3న సర్టిఫికెట్ల పరిశీలన
అనంతగిరి: జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 12 పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 3వ తేదీ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని డీఈఓ రేణుకాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022 – 23లో స్పెషల్ ఆఫీసర్, పీజీసీఆర్‌టీ, పీఈటీ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో మెరిట్ లిస్టులోని అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఉదయం 11గంటలకు సంబంధిత ఒరిజినల్స్, రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో హాజరుకావాలని తెలిపారు.
తహసీల్దార్‌పై
చర్యలు తీసుకోవాలి
దోమ: ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన పరిగి తహసీల్దార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం దోమ మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిగి మండలం రంగంపల్లి సర్వే నంబర్ 146లో మొత్తం 4.17 గుంటల భూమి ఉందని, అందులోని ఎకరం భూమిని గత నెల 9న ఇతరుల పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. ఇదే గ్రామంలోని సర్వే నంబర్ 256లో 20.23 గుంటల భూమి ఆక్రమించేందుకు కొందరు రియల్టర్లు ప్రయత్నిస్తూన్నా తహసీల్దార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నేతలు సత్తయ్య, చెన్నారెడ్డి, వెంకటేశ్, రాములు, ఆనంద్, రాజు పాల్గొన్నారు.
హామీలు అమలు చేయాలి
మొయినాబాద్: ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమనేత దేశమొళ్ల ఆంజనేయులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం మున్సిపల్ కేంద్రంలో ఉద్యమకారులు రిలే నిరహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మర్చిపోయిందని విమర్శించారు. ఉద్యమకారులను మరవద్దనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షుడు మహిపాల్, నాయకులు కుమ్మరి రమేష్, భిక్షపతి, మధు, అవినాష్, ముకుందరెడ్డి, బన్సీలాల్, రత్నం, కేబుల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
మరకత శివాలయం
సందర్శన
శంకర్‌పల్లి: మండల పరిధిలోని చెందిప్పలో వెలసిన శ్రీ బ్రహ్మాసూత్ర మరకత శివాలయా న్ని సోమవారం సినీ నటుడు బాలాజీ దర్శించుకున్నారు. స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. మరకత శివాలయం ఎంతో అద్భుతంగా ఉందని, సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటానని తెలిపారు.

3న సర్టిఫికెట్ల పరిశీలన

3న సర్టిఫికెట్ల పరిశీలన