
భూ తగాదాలతో వ్యక్తి హత్య
● రాడ్డుతో తలపై మోది దారుణం ● మరొకరికి తీవ్ర గాయాలు
దౌల్తాబాద్: భూతగాదాలతో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యా యి. ఈ సంఘటన దౌల్తాబాద్ మండలం బండివా డ తండా శివారులో సోమవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులుస్థానికుల కథనం ప్రకారం.. బండివాడ తండా,హన్మ్యానాయక్ తండాలు పక్కనే పక్క నే ఉంటాయి. ఈ రెండు తండాల్లోని బాబునాయక్, విజయ్‌నాయక్‌కు కొన్నేళ్లుగా భూతగాదాలు ఉన్నా యి. ఇరువర్గాల మధ్య ఆదివారం మధ్యా హ్నం గొడవ జరిగింది. విజయ్‌నాయక్ వర్గం బాబునాయక్ వర్గంపై దాడి చేయడంతో ఐదుమందికి గాయాలయ్యాయి. దీంతో క్షత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాత్రి బాబునాయక్, అతని తమ్ముడు వెంకట్‌నాయక్ మరో వ్యక్తి శ్రీరాంలు బైక్‌పై ఇంటికి వెళ్తున్న క్రమంలో విజయ్ వర్గం కాపుకాచి రాడ్డుతో దాడి చేసింది. గాయాలతో బాబునాయక్ తప్పించుకున్నారు. వెంకట్‌నాయక్(38)పై తలపై రాడ్డుతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను చుట్టుపక్కల వారు కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో తండాలో పోలీ సు పికెట్ ఏర్పాటు చేశారు. మృతుడికి ఒక కుమారుడు. ముగ్గురు కూతుర్లు ఉన్నారు. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీధరెడ్డి, ఎస్‌ఐ రవిగౌడ్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.