టాటా | - | Sakshi
Sakshi News home page

టాటా

Jun 30 2025 7:52 AM | Updated on Jun 30 2025 7:52 AM

టాటా

టాటా

సోమవారం శ్రీ 30 శ్రీ జూన్‌ శ్రీ 2025
టీబీకి

8లోu

కొడంగల్‌ రూరల్‌: క్షయ కట్టడికి జిల్లా అధికారులు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు బాధితులను గుర్తిస్తూ మందులు పంపిణీ చేస్తూ టీబీ నివారణకు కృషిచేస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో వ్యాధిని గుర్తిస్తూ చికిత్స విధానాలపై అవగాహన కల్పిస్తూ కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. టీబీ సోకినవారు ఆందోళన చెందకుండా ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వాడాలని.. ఇతరులకు వ్యాధి సోకకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

సరైన సమయంలో చికిత్స అవసరం

క్షయ నివారణకు వైద్యుల సూచనలు పాటిస్తూ సరైన చికిత్స తీసుకోవాలి. ఇది మనిషిని బలహీన పరుస్తుందని.. ఇది అంటు వ్యాధి అయినందున జాగ్రత్తలు పాటించాలి. క్రమం తప్పకుండా మందులు తీసుకుంటే వ్యాధిని కట్టడి చేయొచ్చని సూచిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు వ్యాధిగ్రస్తులకు ఎప్పటికప్పుడు మందులు ఇస్తూ నివారణ చర్యలు తీసుకుంటున్నారు.

నిబంధనలు తప్పనిసరి

ప్రైవేటు ఆస్పత్రుల్లో క్షయ బాధితులను గుర్తిస్తే వారి వివరాలను జిల్లా క్షయ నియంత్రణ శాఖకు సమాచారం ఇవ్వాలి. బాధితుడికి ఆరు నెలలపాటు చికిత్స అందించాలి. బాధిత కుటుంబసభ్యులు, ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది, వ్యాధి సోకిన వ్యక్తులు ప్రతీ ఒక్కరి సమష్టి కృషితోనే వ్యాధి నివారణ సాధ్యమవుతుంది.

వ్యాధి గుర్తింపు

రెండు వారాలకు మించి ఎడతెరిపి లేకుండా దగ్గు, సాయంత్రం జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, చాతిలో నొప్పి తదితర లక్షణాలుంటే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలి. ఉచితంగా తెమడ పరీక్షలు చేసి వ్యాధిని గుర్తిస్తారు. ఈ వ్యాధి ఊపిరితిత్తులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. పొగ తాగేవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

శిబిరాలను వినియోగించుకోవాలి

వైద్య శిబిరాల్లో డయాబెటిస్‌, డయాలసిస్‌, 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, బీపీ, షుగర్‌, పాత టీబీ వ్యాధిగ్రస్తులు, ప్రస్తుతం లక్షణాలు కనిపించే వ్యక్తులు, హెచ్‌ఐవీ తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహిస్తూ ఉచితంగా మందులను అందిస్తున్నారు. జిల్లాలోని మర్పల్లి, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌, తాండూరు ఆస్పత్రుల పరిధిలోని సబ్‌ సెంటర్లలోని గ్రామాల్లో సోమ, మంగళ, బుధ, శుక్రవారం వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు.

అవగాహనతో వ్యాధి దూరం

న్యూస్‌రీల్‌

క్షయ కట్టడికి టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ శిబిరాలు

కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు

వ్యాధి నివారణపై బాధితులకు సూచనలు

సమష్టి కృషితో నివారణ

వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడాలి. ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు టీబీకి సంబంధించి ఏ ఒక్క లక్షణం కనిపించినా వ్యాధిగ్రస్తులను ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలి. ప్రైవేటు ఆస్పత్రుల, ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు, వ్యాధిగ్రస్తులు, వ్యాధిగ్రస్తుల కుటుంబసభ్యులు సమష్టిగా, బాధ్యతగా వ్యవహరిస్తూ టీబీ నియంత్రణకు కృషిచేయాలి. వ్యాధి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.

– డాక్టర్‌ రవీంద్రయాదవ్‌, జిల్లా క్షయ నియంత్రణ అధికారి

టాటా1
1/4

టాటా

టాటా2
2/4

టాటా

టాటా3
3/4

టాటా

టాటా4
4/4

టాటా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement