విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

Jun 29 2025 7:21 AM | Updated on Jun 29 2025 7:21 AM

విద్య

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

బంట్వారం: ప్రమాదవ శాత్తు విద్యుత్‌ షాక్‌తో ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం కోట్‌పల్లి మండలంలోని బార్వాద్‌ గ్రామంలో చోటు చేసుకుంది. కోట్‌పల్లి ఎస్‌ఐ శైలజ తెలిపిన వివరాల ప్రకారం.. పట్లోల్ల మహేందర్‌రెడ్డి (57) తన పొలం చుట్టూ సోలార్‌ వైర్‌ వేసుకున్నాడు. ఎప్పటిలాగే ఉదయం వేళ పొలం పనులకు వెళ్లాడు. అక్కడ విద్యుత్‌ తీగ తెగిపడి సోలార్‌ వైర్‌పై పడి ఉంది. ఈ విషయాన్ని గమనించకుండా వెళ్లిన మహేందర్‌రెడ్డి సోలార్‌ వైర్‌కు కాలు తగలడంతో విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. మృతుడి భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని ఎస్‌ఐ శైలజ తెలిపారు.

ట్రాక్టర్‌ ట్రాలీ ఢీకొని వ్యక్తి మృతి

కొడంగల్‌ రూరల్‌: ట్రాక్ట ర్‌ ట్రాలీ ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రావులపల్లి సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని అప్పాయిపల్లికి చెందిన శేఖర్‌(30) రావులపల్లిలోని ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం ఉదయం అప్పాయిపల్లి నుంచి విధులకు బయల్దేరాడు. ఈ క్రమంలో రావులపల్లి సమీపంలో ముందు వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ టైర్‌ అకస్మాత్తుగా పేలడంతో ట్రాలీ పక్కకు తిరిగి వెనక ఉన్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శేఖర్‌ కిందపడడంతో తీవ్రగాలయ్యాయి. ఇది గమనించిన పలువురు 108లో కొడంగల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలిస్తుండగా శేఖర్‌ మృతిచెందాడు. మృతదేహాన్ని కొడంగల్‌ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. శేఖర్‌ భార్య అంబమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ జీవీ సత్యనారాయణ తెలిపారు.

వ్యక్తి అదృశ్యం

పహాడీషరీఫ్‌: వ్యక్తి అదృశ్యమైన సంఘటన బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పహాడీషరీఫ్‌కు చెందిన హబీబుల్లాఖాన్‌ కుమారుడు రహ్మతుల్లాఖాన్‌(40) తాగుడకు బానిసయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు 2024 జనవరిలో బాలాపూర్‌ మెట్రో సిటీలోని మా హెల్ప్‌ డిటెక్షన్‌ సెంటర్‌లో చేర్పించారు. ఆరు నెలల పాటు చికిత్స పొందిన అనంతరం రహ్మతుల్లా ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం వెతికినా లాభం లేకపోవడంతో సోదరుడు అంజదుల్లాఖాన్‌ శుక్రవారం రాత్రి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు బాలాపూర్‌ పీఎస్‌లో లేదా 87126 62366 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

వ్యక్తి బలవన్మరణం

మాడ్గుల: చికెన్‌ తీసుకుని వస్తానని ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని నర్సాయిపల్లిలో చోటు చేసుకుంది. సీఐ వేణుగోపాల్‌రావు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కడారి అంజన్‌కుమార్‌(36) శుక్రవారం సాయంత్రం చికెన్‌ తీసుకువస్తానని చెప్పి వేయిరూపాయలు తీసుకుని కొలుకులపల్లికి వెళ్లాడు. రాత్రైనా రాకపోవడంతో ఫోన్‌ చేయగా స్విచ్ఛాప్‌ వచ్చింది. శనివారం గ్రామ శివారులోని గుట్టమీద రేల చెట్టుకు పంచతో ఉరేసుకున్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. మృతుడికి భార్య అలివేలు, ఓ కూతురు ఉన్నారు. అంజన్‌కుమార్‌ తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అభివృద్ధి పనులు ప్రారంభం

రాజేంద్రనగర్‌: శివరాంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.3 కోట్లతో మౌలిక వసతులను కల్పించేందుకు విర్టుసా మల్టీ నేషనల్‌ కంపెనీ ముందుకు వచ్చింది. పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పడమటి శ్రీధర్‌ రెడ్డి చేతులు మీదుగా శనివారం పూజ చేశారు. ప్రస్తుతం గ్రౌండ్‌ లెవెల్లింగ్‌, భవనం మొత్తాకి ఐరన్‌ గ్రిల్స్‌, పెయింటింగ్‌ మొదటి విడదతలో చేపట్టింది. ఈ మొత్తం పని జరిగితే కార్పొరేట్‌ పాఠశాల భవనం మాదిరిగా ఉంటుంది.

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి 1
1/1

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement