
వ్యవసాయ శాఖ ఏడీఏ రుద్రమూర్తి
ఫార్మర్ రిజిసీ్ట్ర తప్పనిసరి
తాండూరు రూరల్: ౖరెతులు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పక చేసుకోవాలని తాండూరు డివిజన్ వ్యవసాయ శాఖ ఏడీఏ రుద్రమూర్తి అన్నారు. సోమవారం ఆయన వ్యవసాయ శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రుద్రమూర్తి మాట్లాడుతూ.. రైతులు పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు, ఆధార్‌తో లింకు ఉన్న మొబైల్‌తో సంబంధిత ఏఈఓల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజసీ్ట్ర ఉంటేనే భవిష్యత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీ పథకాలు వర్తిస్తాయని చెప్పారు. అపోహలకు తావులేకుండా రైతులంతా ఫార్మర్ రిజిసీ్ట్ర చేసుకోవాలని సూచించారు.
డివిజన్ పరిధిలోని
రైతుల వివరాలు
మండలం రైతులు
తాండూరు 14,804
పెద్దేముల్ 15,161
యాలాల 14,798
బషీరాబాద్ 14,512