
సొసైటీ సేవలు అభినందనీయం
రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్
తాండూరు టౌన్/తాండూరు రూరల్: యువతీ యువకుల కోసం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్‌మెంట్ సొసైటీ సేవలు అభినందనీయమని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ కొనియాడారు. బుధవారం ఆయన సొసైటీ ఆధ్వర్యంలో యువతులకు కొనసాగుతున్న కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో యువతీ యువకులకు, విద్యార్థులకు ఎప్‌సెట్, టెట్, డీఎస్సీ కోచింగ్, మెహందీ, కుట్టు మిషన్ శిక్షణ తదితర సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు కమాల్ అతర్, ఉపాధ్యక్షుడు బాసిత్ అలీ, కార్యదర్శి మహ్మద్ యూనిస్, కోశాధికారి సిరాజ్, అబ్దుల్ సలీం, అబ్దుల్ ఖవి, ఖయ్యూమ్ అతర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.