
ఆర్థిక ఇబ్బందుల కారణంగా..
వ్యక్తి అదృశ్యం
కేశంపేట: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ రాజ్‌కుమార్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని కొత్తపేట గ్రామానికి చెందిన మామిడి శివ అలియాస్ సిటీ కేబుల్ శివ(32) ఈ నెల 12న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సెలఫోన్ లొకేషన్ ఆధారంగా వరంగల్‌లో ఉన్నట్లు తెలుసుకున్న కుటంబ సభ్యులు అక్కడికి వెళ్లి వెతికినా ఆచూకీ లభించలేదు. శివ ఆత్యహత్య చేసుకుంటున్నాంటూ పెట్టిన సెల్ఫీ వీడియో చూస్తూ కుటుంబీకులు, మిత్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. శివ తల్లి అనుసూయ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తప్పు చేస్తే క్షమించండి
‘హలో.. హయ్.. ఇన్ని రోజులు నాకు సహకరించిన ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, శ్రేయోభిలాషులు, స్కూల్, ఇంటర్ ఫ్రెండ్స్, అమ్మనాన్నలకు ప్రత్యేక ధన్యవాదాలు. అభివృద్ధిలో ఆర్ధికంగా అన్ని రకాలుగా సహకరించిన ప్రతాపన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఫ్రెండ్స్ మీఅందరిని వదిలేసి వెళ్లిపోతున్నందుకు బాధగా ఉంది. తెలిసీతెలియక మీతో అమర్యాదగా మాట్లాడి ఉంటే, తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి’అంటూ స్పెల్పీ వీడియో పోస్టు చేశాడు. ఈ వీడియోను చూస్తూ మిత్రులు, కుటుంబీకులు కన్నీటి పర్యంతం అయ్యారు.