
హకీంపేట్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు
దుద్యాల్: మండలంలోని హకీంపేట్ ప్రధాన కూడలిలో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ యాదగిరి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హకీంపేట్‌లో సీసీ కెమెరాలు లేకపోవడంతో వాటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
విద్యుదా ఘాతంతో చెరుకు పంట దగ్ధం
తాండూరు రూరల్: విద్యుదా ఘాతంతో చెరుకు పంట దగ్ధమైంది. ఈ సంఘటన పెద్దేముల్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్దేముల్ గ్రామానికి చెందిన రైతు జితేందర్‌రెడ్డి చెరుకు పంట సాగు చేశాడు. శనివారం మధ్యాహ్నం పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు ఒకదానికొకటి రాసుకొని మంటలు చెలరేగి చెరకుపంట దగ్ధమైంది. ఈ విషయాన్ని స్థానిక రైతులు గుర్తించి జితేందర్‌రెడ్డికి సమాచారం చేరవేశారు. ఆ తర్వాత అందరూ కలిసి మంటలను ఆర్పేశారు. అయితే పొలంలో విద్యుత్‌తీగలు వేలాడుతున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు ఏర్పడ్డాయన్నారు. వేలాడుతున్నా విద్యుత్‌వైర్లకు మరమ్మతులు చేయాలని గతంలో విద్యుత్ అధికారులను పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చెరుకు పంటతో పాటు బోరు మోటారు, స్టాటర్, విద్యుత్‌వైర్లు పూర్తిగా కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సంఘటనలో సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని రైతు పేర్కొన్నాడు.
చేపలు పట్టడానికి వెళ్లి..
గండిపేట చెరువులో మునిగి వ్యక్తి మృతి
మొయినాబాద్: చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదశాత్తు నీట మునిగి చని పోయాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి చిలుకూరులో ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. చిలుకూరుకు చెందిన తోల్కట్ట శ్రీశైలం(28) బాలాజీ దేవాలయం వద్ద కొబ్బరికాయ లు విక్రయించడంతో పాటు చెరువులో చేపలు పడుతూ కుటుంబాన్ని పోషించేవాడు. కాగా ఈ నెల 8న శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు గ్రామ సమీపంలోని గండిపేట చెరువు లో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చెరువులో చేపల కోసం వల వేస్తుండగా అది అ తని కాళ్లకు చుట్టుకొని నీటిలో మునిగిపోయా డు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికా రు. కాగా ఆదివారం ఉ దయం అతడి మృతదే హం చెరువులో తేల డాన్ని గమనించిన స్థానికు లు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

హకీంపేట్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు