
శ్లోకాల పఠనంతో జ్ఞానసముపార్జన
భగవద్గీత అధ్యాపకుడు రాములు, మండల మాజీ ఉపాధ్యక్షుడు మల్లేశం
దోమ: భగవద్గీత శ్లోకాలను కంఠస్తం చేయడంతో జ్ఞాపక శక్తి పెరుగుతుందని భగవద్గీత అధ్యాపకుడు రాములు, మండల మాజీ ఉపాధ్యక్షుడు జి.మల్లేశం అన్నారు. మండలంలోని మోత్కూర్ గ్రామంలో ఏడాదిగా విద్యార్థులకు భగవద్గీత అభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 12వ ఆధ్యాయం పూర్తయిన సందర్భంగా శనివారం విద్యార్థులకు శ్లోకాల పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భగవద్గీత పఠనం చేయాలని సూచించారు. అందులోని శ్లోకాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయుడు పాలేపల్లి వెంకటయ్య, మాజీ ఉప సర్పంచ్ కరణం శ్రీకాంత్ రావు, విద్యార్థులు, గ్రామస్తులు, పాల్గొన్నారు.