
అంతర్జాతీయ క్రీడాకారులను అందించడం గర్వకారణం
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
గచ్చిబౌలి: తమ అకాడమీ నుంచి అంతర్జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులను అందించడం గర్వకారణంగా ఉందని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఏర్పాటు చేసిన కార్పొరేట్ ఉద్యోగుల బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల వారిలో పని ఒత్తిడి తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంతో ఉద్యోగఒత్తిడి ఉన్నప్పటికీ శారీరక వ్యాయామం చాలా అవసరమన్నారు. శారీరక వ్యాయామ లేకపోవడం వల్లే చాలా మంది కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు రోగాల బారిన పడుతున్నారన్నారు. వారిని రోగాలకు దూరం చేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. అంతకుముందు ఈ పోటీలలో రెడ్డీస్ ల్యాబ్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, విప్రో, డెల్, ఐకియా వంటి సంస్థలకు చెందిన ఉద్యోగులు ఈ పోటీలలో పాల్గొంటున్నారు.