
మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వద్దు
దుద్యాల్: వన నర్సరీల్లో మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించరాదని ఏపీడీ సరళాకుమారి సూచించారు. గురువారం దుద్యాల్ మండలం హస్నాబాద్‌లోని వన నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున నర్సరీల్లోని మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉందని, నిత్యం నీటిని అందించాలని నిర్వాహకులకు సూచించారు. వర్షాకాలం ప్రారంభం నాటికి మొక్కలను సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, ఏపీవో రాములు తదితరులు పాల్గొన్నారు.
ఏపీడీ సరళాకుమారి