
అంకితభావంతో పనిచేద్దాం
అనంతగిరి: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కో సం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్‌రావు అన్నారు. గురువారం వికారాబాద్‌లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అటవీ శాఖ జిల్లా అధికారి జ్ఞానేశ్వర్‌ను, అసోసియేట్ అధ్యక్షుడిగా వెటర్నరి అసి స్టెంట్ సర్జన్ డాక్టర్ ఆనంద్, ఉపాధ్యక్షుడిగా ఎంపీఓ సఫీవుల్లాఖాన్, జాయింట్ సెక్రటరీగా పరహీన్ ఖాతూన్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సెంట్రల్ కమిటీ సభ్యుడు కోటాజీ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రామారావు, శ్రీరాంరెడ్డి పాల్గొన్నారు.
టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు