కంటి పరీక్షలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

కంటి పరీక్షలు తప్పనిసరి

May 9 2025 8:14 AM | Updated on May 9 2025 8:14 AM

కంటి పరీక్షలు తప్పనిసరి

కంటి పరీక్షలు తప్పనిసరి

బంట్వారం: వయస్సు పైబడిన వారంతా తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించకోవాలని తాండూరు ఎమ్మెల్యే బి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం కోట్‌పల్లి మండల కేంద్రంలో ఎల్‌ఎన్‌ఆర్‌ యువసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కంటి చూపు లేకపోతే మానవ జీవితం అందకారమన్నారు. అశ్రద్ధ వహించకుండా కళ్లను జాగ్రత్తగా పరిరక్షించుకోవాలన్నారు. చూపు మసక బారిన వెంటనే అవసరమైన వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement