ట్యాక్స్‌ కట్టేవారు అనర్హులు | - | Sakshi
Sakshi News home page

ట్యాక్స్‌ కట్టేవారు అనర్హులు

May 9 2025 8:14 AM | Updated on May 9 2025 8:14 AM

ట్యాక

ట్యాక్స్‌ కట్టేవారు అనర్హులు

తాండూరు రూరల్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇన్‌కాం ట్యాక్స్‌ కట్టే వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయరని, అనర్హులుగా గుర్తిస్తారని జిల్లా హౌజింగ్‌ ప్రాజెక్ట్‌డైరెక్టర్‌ కృష్ణయ్య పేర్కొన్నారు. గురువారం పెద్దేముల్‌ మండలం కందనెల్లి గ్రామంలో లబ్ధిదారుల నివాసప్రాంతాలకు వెళ్లి ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఐదెకరాల కంటే ఎక్కువ ఉంటే ఇళ్లు మంజూరు చేయరన్నారు. ఆర్‌సీసీ స్లాబ్‌ ఉన్నా, ఫోర్‌ వీలర్స్‌ ఉన్నా కూడా అనార్హులుగా గుర్తిస్తారని పేర్కొన్నారు. ఉమ్మడి ఇటింతో పాటు పాత ఇంటిని పొడిగిస్తామని చెప్పిన కూడా మంజూరు చేయరని తేల్చి చెప్పారు. ఇంటి స్థలం ఉన్న నిరుపేదలను ఎంపిక చేసి, రూ.5లక్షలు విడతల వారీగా చెల్లిస్తామని వివరించారు. ఈ విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రస్తుతం జిల్లాలోని అన్నీ గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారని, వారం రోజుల్లో కలెక్టర్‌ తుది జాబితాను విడుదల చేస్తారన్నారు. విడుదల చేసిన తర్వాత ఇంటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్‌ ఎంపీడీఓ రతన్‌సింగ్‌, హౌజింగ్‌ డీఈ కలీమోద్దీన్‌, ఏఈ రహీం, వెరిఫికేషన్‌ అధికారి ఎంఈఓ నర్సింగ్‌రావు, పంచాయతీ కార్యదర్శి మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మోడల్‌ హౌజ్‌ పరిశీలన

తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్మిస్తున్న మోడల్‌ హౌజ్‌ను త్వరగా పూర్తి చేయాలని హౌసింగ్‌ అధికారులకు పీడీ కృష్ణయ్య ఆదేశించారు. ఇందిరమ్మ ఇల్లు రూ.5 లక్షలతో ఎలా నిర్మించాలనే ఉద్దేశ్యంతో ప్రతి కేంద్రంలో ఓ మోడల్‌ హౌజ్‌ నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విశ్వప్రసాద్‌ పాల్గొన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

యాలాల: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని కో ఆప్షన్‌ మాజీ సభ్యుడు అక్బర్‌బాబా, ఏఎంసీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసప్రాంతాలకు వెళ్లి విచారణ చేపట్టారు. గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలు, ఇళ్ల స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేపట్టడానికి సిద్ధంగా ఉన్న లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు. అనంతరం ఏఓ శ్వేతరాణి, పంచాయతీ కార్యదర్శి గ్రామస్తుల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగయ్య, చందు, శేఖర్‌, మైను, లాలప్ప, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వరు

హౌజింగ్‌ జిల్లా పీడీ కృష్ణయ్య

ట్యాక్స్‌ కట్టేవారు అనర్హులు1
1/1

ట్యాక్స్‌ కట్టేవారు అనర్హులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement