దుద్యాల్: గ్రామాల్లో రైతులకు వ్యవసాయ సూచనలు చేసే ఏఈవోలకు కొత్త ఫోన్ నంబర్లు వచ్చాయి. గతంలో వ్యవసాయ శాఖ అందించిన ఫోన్ నంబర్లు సాంకేతిక సమస్యతో పని చేయకుండా పోయాయి. దీంతో రైతులకు పంటల సాగుపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఇబ్బందులు తలెత్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ ఏఈవోలు కొత్త ఫోన్ నంబర్లు మంజూరు చేసింది. దుద్యాల్ క్లస్టర్ పరిధిలోని దుద్యాల్, గౌరారం, హంసంపల్లి గ్రామాల ఏఈవో కే భావనకు సెల్ నంబర్ 8977768852ను కేటాయించారు.
హస్నాబాద్ క్లస్టర్ పరిధిలోని హస్నాబాద్, ఆలేడ్ గ్రామాల ఏఈవో వి.రేణుక – 89777 68859, కుదరుమల్ల క్లస్టర్ పరిధిలోని కుదురుమల్ల, చిలుములమైల్వార్, సంగాయిపల్లి, మాచన్‌పల్లి, నాజుఖాన్‌పల్లి గ్రామాల ఏఈవో కే జ్యోతి – 89777 68860, పోలేపల్లి క్లస్టర్ పరిధిలోని పోలేపల్లి, హకీంపేట్, ఈర్లపల్లి, లగచర్ల గ్రామాల ఏఈవో పి.మాణికేశ్వరి – 89777 68861కు సెల్ నంబర్లను కేటాయించారు. ఆయా గ్రామాల రైతులు వ్యవసాయ సంబంధిత వివరాల కోసం పై పేర్కొనన ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఏఈవోలు సూచించారు.
పూరిల్లు దగ్ధం
మోమిన్‌పేట: పూరిల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని మొరంగపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సిరివాటి దుర్గమ్మ పూరి గుడిసెలో నివాసం ఉంటోంది. డెసెలో నివాసముంటుంది. ఉదయం సాన్నం చేసేందుకు పొయ్యిపై నీరు పెట్టి బయటకు వచ్చింది. అంతలో ఇంటికి మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకొని కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి అర్పేలోపు పూర్తిగా కాలిపోయింది. నిత్యవసర సరుకులు, బట్టలు పూర్తిగా కాలిపోయాయి. ప్రభుత్వం పేద మహిళను అదుకోవాలని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మాజీ ఎంపీపీ ఒగ్గు మల్లయ్య కోరారు.
హైనా దాడిలో దూడ మృతి
కుల్కచర్ల: హైనా దాడిలో దూడ మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. అటవీశాఖ బీట్ ఆఫీసర్ మెయిన్ తెలిపిన వివరాల ప్రకారం.. లాల్‌సింగ్ తండాకు చెందిన సక్య్రనాయక్ గురువారం తన పొలంలో దూడను కట్టేసి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున పొలానికి వచ్చి చూడగా దూడపై గుర్తు తెలియని జంతువు దాడి చేసి చంపేసింది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అక్కడ ఉన్న పాద ముద్రల ఆధారంగా దూడపై హైనా దాడి చేసిందని నిర్దారించారు. రైతులు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని సూచించారు. అడవి జంతువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
శివసాగర్‌లోకి దూసుకెళ్లిన కారు
అనంతగిరి: వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి శివసాగర్ చెరువులోకి దూసుకెళ్లింది. నీళ్ల అంచువరకు వెళ్లి ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం స్థానికుల సాయంతో కారును బయటకు లాగారు.