వేసవిలో దున్ను.. దిగుబడులకు దన్ను | - | Sakshi
Sakshi News home page

వేసవిలో దున్ను.. దిగుబడులకు దన్ను

May 9 2025 8:14 AM | Updated on May 9 2025 8:14 AM

వేసవిలో దున్ను.. దిగుబడులకు దన్ను

వేసవిలో దున్ను.. దిగుబడులకు దన్ను

షాబాద్‌: పంటల సాగులో శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాని ఏఓ వెంకటేశం తెలిపారు. పలు సందర్భాల్లో రైతులు తీసుకునే సొంత నిర్ణయాలు దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. వేసవి దుక్కులతో కలిగే లాభాలను వివరించారు.

● పంట కొయ్యలను కాల్చకుండా,

కలియదున్నాలి.

● వేసవిలో లోతు దుక్కులతో చాలా ప్రయోజనాలున్నాయి.. పురుగులు, తెగుళ్లు, కలుపును నివారించడంతో పాటు భూమి పొరల్లో వర్షపునీరు ఇంకి పంటకు ఉపయోగపడుతుంది.

● ఏప్రిల్‌, మే నెలలు వేసవి దుక్కులకు అనుకూలం.

● అడ్డం, పొడవు సాళ్లలా కాకుండా ఏటవాలుగా దున్నడం శ్రేయస్కరం.

● ఏటవాలు దుక్కులతో భూమి కోతకు గురికాకుండా ఉంటుంది.

● లోతుగా దున్నినప్పుడు పంటలకు హాని చేసే క్రిమికీటకాలతో పాటు లార్వా దశలో ఉండే గుడ్లు సూర్యకిరణాలు పడి నాశనమవుతాయి.

● తొలకరి వర్షాలు కురిసిన వెంటనే విత్తనాలు వేసుకునే అవకాశం కలుగుతుంది.

● అంతకుముందే రెండుసార్లు దున్నితే గట్టిగా ఉన్న భూమి గుల్లబారుతుంది.

● ఇది కలుపును నియంత్రించడంతో పాటు నేలలో ఎక్కువ కాలం తేమ నిల్వ ఉండేలా దోహదపడుతుంది.

● భూమి పొరల్లోకి గాలి చేరుతుంది.

● సూక్ష్మజీవుల సాంద్రత, సేంద్రియ కర్బన వినియోగం పెరుగుతుంది.

● మొక్క వీటిని నేరుగా గ్రహించే అవకాశం ఉంటుంది.

● కలుపు, పురుగు మందుల అవశేషాలతో మొక్కలకు కీడు కలగకుండా ప్రభావం చూపుతుంది.

● గాలిలో ఉన్న నత్రజని వర్షపు నీటితో కలిసి భూ మిలోకి చేరడం వల్ల భూసారం పెరుగుతుంది.

● పురుగుమందులు, తెగుళ్ల మందుకయ్యే పెట్టుబడిని తగ్గించుకోవచ్చు.

లోతైన దుక్కులతో పంటలకు పుష్టి

తొలకరి వర్షాలకేవిత్తనాలు వేసుకునే అవకాశం

ఏటవాలు సాళ్లతో భూమి కోతకు అడ్డుకట్ట

వ్యవసాయశాఖ అధికారి వెంకటేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement