
విద్యార్థుల భవిష్యత్‌కు కృషి
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి: విద్యార్థుల అభ్యున్నతికి, వారి మంచి భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మర్పల్లి మండలం బుచ్చన్‌పల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని బోయిని సాయితన్మయి ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో మొదటి ర్యాంకు, రాష్ట్రంలో 3వ ర్యాంకు సాధించింది. దీంతో ఎమ్మెల్యే తన నివాసంలో మంగళవారం విద్యార్థినిని సన్మానించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమాలను తీసుకువచ్చిందన్నారు. జిల్లా విద్యార్థి ఇంటర్‌లో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించడం ఎంతో గర్వకారణం అన్నారు. ఉన్నత చదువులు చదివి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు, నాయకులు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.