
కేక్ కోసం వెళ్లి.. ప్రమాదానికి గురై
బొంరాస్‌పేట: మండల పరిధిలోని తుంకిమెట్ల వద్ద జాతీయ రహదారి 163పై ఉన్న కల్వర్టు వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు తీవ్రగాయాలై ఆస్పత్రిలో చేరారు. స్థానికుల వివరాల ప్రకారం.. దుద్యాల్ మండల కేంద్రానికి చెందిన భరత్ పుట్టినరోజు కావడంతో కేక్ కోసం బొంరాస్‌పేటకు ద్విచక్రవాహనంపై తన స్నేహితుడు అనంతరాములుతో వెళ్తున్నాడు. తుంకిమెట్ల బ్రిడ్జి వద్ద మరమ్మతులకు రహదారిని తవ్వారు. ఇది గమనించని యువకులు ప్రమాదానికి గురయ్యారు. గాయాలు కావడంతో మండల కేంద్రం ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు