
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
డాక్టర్ న్యూటన్ కొండవీటి
బంట్వారం: ఆధ్యాత్మిక చింతన, ధ్యానంతో మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని లైఫ్ యూనివర్సిటీ నిర్వహకులు డాక్టర్ న్యూటన్ కొండవీటి అన్నారు. సోమవారం ఆయన కోట్‌పల్లి మండలంలోని ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో ఆయన గంటపాటు ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో లైఫ్ యూనివర్సిటీ నిర్వాహకులు డాక్టర్ లక్ష్మి, ప్రతినిధులు పవణ్‌కుమార్, హారిక, సూరి, నిర్మళ, సూరారెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ లఘు చిత్రం ‘అక్షరమే ఆధారం’
షాద్‌నగర్‌రూరల్: దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకని టాలీవుడ్ క్రియేటివ్ డైరక్టర్స్ అసోసియే, రెయిన్‌బో చిల్డ్రన్స్ సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని రవీంద్ర భారతిలో ఆదివారం రాత్రి రాష్ట్రస్థాయి లఘు చిత్రాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో షాద్‌నగర్‌కు చెందిన టీవీ రంగయ్య నటించి దర్శకత్వం వహించిన అక్షరమే ఆధారం షార్ట్ ఫిలింను ప్రదర్శించారు. ఈ చిత్రం ఉత్తమ సందేశాత్మక లఘుచిత్రంగా ఎంపికై ంది. ఈ సందర్భంగా రెయిన్‌బో సంస్థ డైరక్టర్ మోహన్ ఉత్తమ లఘు చిత్రం అవార్డును టీవీ రంగయ్యకు అందజేశారు.
టిప్పర్ ఢీకొని
పశువుల కాపరి దుర్మరణం
తాండూరు రూరల్: టిప్పర్ ఢీకొని ఓ పశువుల కాపరి మృతి చెందాడు. ఈ ఘటన పెద్దేముల్‌లో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన బుర్ణపూరి రవి(41) అవివాహితుడు. అదే గ్రామానికి చెందిన బాలేసాబ్ దగ్గర పశువుల కాపరిగా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే పశువులను మేపేందుకు పెద్దచెరువు వద్దకు వెళ్లాడు. గ్రామానికి చెందిన ముక్రాంఖాన్ తన టిప్పర్‌లో పెద్ద చెరువు నుంచి మట్టి తరలిస్తున్నాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వాహనాన్ని నడుపుతూ పశువుల కాపరి రవిని ఢీకొట్డంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి సోదరుడు ఎల్లప్ప టిప్పర్ యజమాని ముక్రాంఖాన్, డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత