
‘క్షయ’పై అప్రమత్తత అవసరం
కుల్కచర్ల: క్షయ వ్యాధిపై ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని టీబీ హెల్త్ విజిటర్ రాజు అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆధ్వర్యంలో టీబీ వ్యాధిగ్రస్తుల నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు, సహచరులకు టీబీ నిరోధక టీకాలు ఇచ్చారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. క్షయ సోకిన వారు జాగ్రత్తలు పాటించకుంటే ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుందన్నారు. ముందస్తు టీకాతో వ్యాధి నిరోధించే అవకాశం ఉంటుందని చెప్పారు. పౌష్టికాహారం తీసుకుంటూ.. వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.