వెతలు తీరక | - | Sakshi
Sakshi News home page

వెతలు తీరక

May 5 2025 8:02 AM | Updated on May 5 2025 8:02 AM

వెతలు

వెతలు తీరక

సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025
ప్రాజెక్టు పూర్తికాక..

10లోu

కేపీ లక్ష్మీదేవిపల్లి డిజైన్‌ మార్పులతో కాలయాపన

బడ్జెట్‌ సమావేశంలో రిజర్వాయర్‌ ప్రస్తావన

సస్యశ్యామలం కానున్న 2,46,154 ఎకరాల భూమి

త్వరితగతిన నిర్మించాలని అన్నదాతల వేడుకోలు

వికారాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్‌ జిల్లా పరిస్థితి దీపం చుట్టూ చీకట్లే అన్న చందంగా తయారయింది. నగరానికి ఆమడ దూరంలో ఉన్నా అభివృద్ధిలో మాత్రం నత్తతో పోటీ పడుతోంది. దశాబ్దాలుగా పాలకుల అనాలోచితచర్యతో సరిపడా సాగునీటి వనరులు లేకుండా పోయాయి. ఎన్నికల సమయంలో మాత్రం ఈ ప్రాంత రూపురేఖలు మార్చుతామనే నాయకుల వాగ్దానాలు నీటి మీది రాతలుగా మారాయి. జిల్లాకు వరప్రదాయినిగా భావించే కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు ప్రభుత్వం బడ్జెట్‌లో మొండి చేయి చూపించింది. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించినప్పటికీ ప్రత్యేకంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రస్తావన అందులో లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామని గత బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రస్తావించింది. కానీ ఇప్పటివరకు ముందడుగు పడలేదు. గతంలోనే పరిగి నియోజకవర్గం సరిహద్దులో కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి హోదాలో భట్టి విక్రమార్క బడ్జెట్‌లో పేర్కొన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

కల నెరవేరుతుందా?

జిల్లాకు చెందిన ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ ఏదో ఒక కొర్రీలు పెట్టి ప్రభుత్వాలు పక్కన పెడుతున్నారు. సర్వేలు, రీడిజైన్లు, కేసులు అంటూ పాలమూరు–రంగారెడ్డి ఎత్తి పోతల పథకాన్ని దశాబ్దాలుగా కాలయాపన చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 50 టీఎంసీల కేటాయింపులున్న ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్‌ పేరుతో గత ప్రభుత్వం అటకెక్కించింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కొన్నేళ్లుగా ఊగిసలాడుతూ వస్తోంది. అనేక సర్వేలతో డిజైన్లను మార్చుతూ వచ్చారు. పాలమూరు ఎత్తిపోతల విషయంలో పదేళ్ల క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వం సర్వే కోసం రూ.6.91 కోట్లు కేటాయించగా.. నిపుణులు సర్వే చేసి డిజైన్‌ వివరాలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 115 టీఎంసీ నీటిని కేటాయించారు. అందులో 45 టీఎంసీల కేపాసిటీతో పరిగి నియోజకవర్గంలోనే రిజర్వాయర్లు కట్టేందుకు ప్రణాళిక చేశారు. ఇందులో గండేడ్‌, కుల్కచర్ల మండల పరిఽధిలో నిర్మించే రిజర్వాయర్‌ సామర్థ్యం 35 టీఎంసీలుగా పేర్కొన్నారు.

న్యూస్‌రీల్‌

ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

బడ్జెట్‌లోనే కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మిస్తామని పేర్కొనడం శుభ పరిణామం. నిధులు కేటాయిస్తామని ఉప ముఖ్యమంత్రి నుంచి హామీ తీసుకున్నాం. రిజర్వాయర్‌ పూర్తయితే జిల్లా రైతాంగానికి ఎంతో మేలు. ఈ విషయాన్ని సీఎంతో పాటు ప్రభుత్వ పెద్దలు, సంబంధిత మంత్రితో చర్చిస్తున్నాం. సీఎం సైతం సానుకూలంగా ఉన్నారు. కచ్చితంగా ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తుంది.

– రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి

సీఎంపైనే ఆశలు

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన లక్ష్మీదేవిపల్లి, పరిగి మండల పరిధిలోని రావులపల్లి గ్రామాల శివారులో సంయుక్తంగా 10 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో జిల్లాకు 2,46,154 ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. అయితే గత సర్కారు హయాంలో అనేక సార్లు రీడిజైన్‌ చేస్తూ వచ్చారు. చివరకు గ్రావిటి ద్వారానే నీళ్లు అందిస్తామని చెప్పి, అది కూడా పూర్తి చేయలేదు. ప్రధాన ప్రాజెక్టుల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటానికే పరిమితమయ్యారు తప్పా పనులు పూర్తి చేయడంలో శ్రద్ధ చూపలేదు. జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ప్రాతినిథ్యం వహిస్తుండడంతో ఈసారైనా కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ పూర్తి చేస్తారని ఆశగా రైతులు ఎదురు చూస్తున్నారు.

వెతలు తీరక1
1/4

వెతలు తీరక

వెతలు తీరక2
2/4

వెతలు తీరక

వెతలు తీరక3
3/4

వెతలు తీరక

వెతలు తీరక4
4/4

వెతలు తీరక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement