‘పట్టా’లేని పాట్లు! | - | Sakshi
Sakshi News home page

‘పట్టా’లేని పాట్లు!

May 4 2025 8:10 AM | Updated on May 4 2025 8:10 AM

‘పట్ట

‘పట్టా’లేని పాట్లు!

దౌల్తాబాద్‌: ఆరుగాలం శ్రమించి పండించి, కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు అనేక అవస్థలు పడుతున్నారు. కొద్ది రోజులుగా వరుణుడు నిత్యం వీరిని భయపెడుతున్నాడు. ఏదో ఒక చోట కురుస్తున్న వానతో ధాన్యం ఆరబోసిన రైతుల పాట్లు అన్నీఇన్నీ కావు. ఎండిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు కనీసం టార్పాలిన్లు (పట్టాలు) కూడా అందుబాటులో లేవు. ప్రభుత్వం ఏడేళ్లుగా వీటి సరఫరాను నిలిపేసింది. దీనికి తోడు బహిరంగ మార్కెట్లో టార్పాలిన్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అంత ఖ రీదు చేసి కొనలేకపోతున్న కర్షకులు ఎరువుల బస్తాలతో పట్టాలు కుట్టించి, ధాన్యం తడవకుండా కాపాడుకుంటున్నారు. మరికొందరు ప్రైవేటు వ్యక్తుల వద్ద టార్పాలిన్లు అద్దెకు తెచ్చుకుంటున్నారు.

ఏడేళ్లుగా ఎదురుచూపులు..

మండలంలో వానాకాలం సీజన్‌కు సంబంధించి 12 వేల ఎకరాల్లో వరిసాగు చేశారు. చాలా గ్రామాల్లో ఇప్పటికే ఎనభైశాతం మేర వరికోతలు పూర్తయ్యాయి. ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు కొనుగోలు సెంటర్లకు తరలిస్తున్నారు. ఈ సమయంలో వడ్లు ఆరబెట్టేందుకు, వర్షం పడితే తడవకుండా కప్పేందుకు టార్పాలిన్లు చాలా అవసరం. గతంలో ప్రభుత్వం సబ్సిడీపై టార్పాలిన్లు అందజేసింది. వీటిని కొనుగోలు చేసేందుకు రైతులు పోటీపడేవారు. డిమాండ్‌ మేర కాకపోయినా.. ఉన్నంతలో ఇచ్చేవారు. కానీ ఏడేళ్లుగా ప్రభుత్వం రాయితీ టార్పాలిన్ల పంపిణీని ఆపేసింది.

బహిరంగ మార్కెట్లో అధికం

ప్రభుత్వం రాయితీపై సరఫరా చేసే టార్పాలిన్లు నాణ్యతతో పాటు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. వీటికి 50శాతం రాయితీని వర్తిస్తుంది. ఒక్కో టార్పాలిన్‌కు రైతు తనవంతుగా వాటా రూ.1,250 చెల్లిస్తే చాలు. అదే ప్రైవేటులో కొనుగోలు చేస్తే ఒక్కో కవర్‌కు రూ.3 వేలు పలుకుతుంది. నాణ్యత కూడా అంతగా ఉండదు.

సబ్సిడీ టార్పాలిన్ల పంపిణీకి సర్కారు మంగళం

2018 నుంచి నిలిపివేత

బహిరంగ మార్కెట్లో అధిక ధరలు

ధాన్యాన్ని కాపాడుకునేందుకు

రైతుల అవస్థలు

రూ.3 వేలు అంటున్నారు

ప్రస్తుతం వరి పంట కోతకు వచ్చింది. పంట కోస్తే ధాన్యం ఆరబెట్టడానికి టార్పాలిన్లు లేవు. ప్రభుత్వం సడ్సిడీపై ఇస్తలేదు. బయట మార్కెట్లో రూ.2,500 నుంచి రూ.3 వేలు అంటున్నారు. – కృష్ణ, రైతు దౌల్తాబాద్‌

ఆదేశాలు రాలేదు

చాలా మంది రైతులు సబ్సిడీ టార్పాలిన్లు కావాలని అడుగుతున్నారు. ఈ విషయా న్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీ సుకెళ్లాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదే శాలు రాలేదు.– లావణ్య, ఏఓ, దౌల్తాబాద్‌

‘పట్టా’లేని పాట్లు!1
1/1

‘పట్టా’లేని పాట్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement