
తాండూరులో ‘దోస్త్’సెంటర్
తాండూరు టౌన్: ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) జిల్లా స్థాయి సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ ఎస్.లక్ష్మణ్ తెలిపారు. శనివారం ఆయన సెంటర్‌ను ప్రారంభించారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దోస్త్ సెంటర్‌లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కళాశాల పనివేళల్లో ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. పేర్ల నమోదు, ఆధార్ ధ్రువీకరణ, వెబ్ ఆప్షన్స్ నమోదు తదితర సేవలు పొందవచ్చన్నారు. వివరాల కోసం దోస్త్ సమన్వయకర్తలు ఎస్.మహేందర్‌రెడ్డి, కిషన్, అమర్‌ను 9885583432, 9959531273, 9849432029 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు షరీఫా, హరికృష్ణ, రవి, ఆశప్ప, అనంతరామ్ పాల్గొన్నారు.
మరిన్ని కొత్త కోర్సులు..
ఈ ఏడాది తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టినట్లు ప్రిన్సిపాల్ లక్ష్మణ్ తెలిపారు. వీటికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. బీఎస్సీ (ఫిజికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్), బీఎస్సీ (లైఫ్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్), బీకాం (కంప్యూటర్ అప్లికేషన్), బీఏ (కంప్యూటర్ అప్లికేషన్స్), బీఏ (మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం), బీఏ (సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, సైకాలజీ, జియోగ్రఫీ, పబ్లిక్ అడ్మిన్‌స్ట్రేషన్) వంటి కోర్సులను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. వీటితో పాటు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం, నాలుగు అధునాతన డిజిటల్ తరగతుల సౌకర్యం అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.
డిగ్రీ కాలేజీలో ప్రారంభించిన ప్రిన్సిపల్ లక్ష్మణ్
కొత్త కోర్సుల కరపత్రాల ఆవిష్కరణ