
ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
● సహచర ఉద్యోగికి రావాల్సిన బిల్లులో లంచం డిమాండ్ ● అవినీతి నిరోధక శాఖ అధికారులనుఆశ్రయించిన బాధితుడు ● ఎకై ్సజ్ కార్యాలయంలో వలపన్ని పట్టుకున్న అధికారులు
అనంతగిరి: ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబట్టారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాలిలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్‌లోని జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే శ్రీధర్ ఉద్యోగుల జీతాలు, ఇతర బిల్స్ చేస్తాడు. ఇదే శాఖలో పనిచేస్తున్న సహచర ఉద్యోగికి 2022– 23 సంవత్సరానికి సంబంధించిన రూ.76 వేల పైచిలుకు బిల్లు రావాల్సి ఉంది. దీన్ని క్లియర్ చేయాలని శ్రీధర్‌ను కోరగా డబ్బులు అడిగాడు. మొత్తం బిల్లులో తనకు 11శాతం లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే బిల్ పాస్ చేసేది లేదని తేల్చిచెప్పాడు. అయితే తన వద్ద డబ్బు లేదని, బిల్లు వచ్చిన వెంటనే ఇచ్చేస్తానని ఉద్యోగి తెలిపాడు. ఇందుకు అంగీకరించిన శ్రీధర్ బిల్ పాస్ చేయడంతో ఇటీవల ఉద్యోగి ఖాతాలో డబ్బులు జమయ్యాయి. చెప్పిన విధంగా తనకు రూ.8 వేలు ఇవ్వాలని శ్రీధర్ పలుమార్లు అతనికి ఫోన్ చేశాడు. న్యాయబద్ధంగా తనకు రావాల్సిన బిల్లులో లంచం ఇవ్వడం ఏమిటని భావించిన సదరు ఉద్యోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు కార్యాలయంలో శ్రీధర్ రూ.8 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి నగదు స్వాధీనం చేసుకుని, అన్ని వివరాలు సేకరించారు. డబ్బులు తీసుకోవడంలో ఇంకా ఎవరి పాత్రయినా ఉందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని నాంపల్లిలోని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ఏసీబీ దాడులు జరుగుతున్నాయనే విషయం క్షణాల్లో మిగితా కార్యాలయాలకు పాకింది. దీంతో అవినీతి అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
1064కు కాల్ చేయండి
జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసినట్లయితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. 9440446106లో, ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా కూడా సమాచారం అందించవచ్చని సూచించారు.