
ఎవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు దగ్ధం
తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం హన్మాపూర్ గేటు వద్ద ఎవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. తాండూరు–జహీరాబాద్ మార్గంలోని రోడ్డుకు ఇరువైపులా అధికారులు ఎవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటారు. హన్మపూర్ గేటు సమీపంలో శుక్రవారం నిప్పంటుంకుని రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు దగ్ధమయ్యాయి. గమనించిన స్థానికులు మంటలు ఆర్పి విషయాన్ని కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. కలెక్టర్, డీఆర్‌డీఏ ఆదేశాల మేరకు పెద్దేముల్ ఎంపీడీఓ రతన్‌సింగ్, పంచాయతీ కార్యదర్శి నర్సింలు ఘటనా స్థలిని పరిశీలించారు. పరిస్థితిని కలెక్టర్‌కు ఫోన్‌లో వివరించినట్లు ఎంపీడీఓ రతన్‌సింగ్ వెల్లడించారు.