
అక్రమంగా గోవుల తరలింపు
ఇబ్రహీంపట్నం: కంటైనర్‌లో అక్రమంగా గోవులు తరలిస్తుండగా బీజేపీ నాయకులు వాటిని గోశాలకు తరలించారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. గురువారం రాత్రి మండల పరిధిలోని రాయపోల్ మీదుగా ఓ కంటైనర్‌లో 42 గోవులను తరలిస్తున్నారు. విషయం గమనించిన స్థానికులు మార్గమధ్యలో వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోవులను ఇరుకుగా ఉంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలుసుకుని వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. అనంతరం బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్టేషన్‌కు చేరుకుని గోవులను సమీపంలోని గోశాలకు తరలించారు.