సీనియర్‌ టెక్నీషియన్‌ బలవ్మరణం | - | Sakshi
Sakshi News home page

సీనియర్‌ టెక్నీషియన్‌ బలవ్మరణం

May 3 2025 8:33 AM | Updated on May 3 2025 8:33 AM

సీనియ

సీనియర్‌ టెక్నీషియన్‌ బలవ్మరణం

తాండూరు రూరల్‌: సో లార్‌ప్లాంట్‌లో పనిచేసే టెక్నీషియన్‌ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దేముల్‌ మండలం ఇందూరు శివారులోని సోలార్‌ప్లాంట్‌లో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. పెద్దేముల్‌ మండలం గోపాల్‌పూర్‌ గ్రామానికి చెందని మాదారపు రాజశేఖర్‌రెడ్డి(37) ఏడేళ్లుగా లిండ్‌స్టోత్‌ సోలార్‌ కంపెనీలో సీనియర్‌ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. రోజుమాదిరిగానే గురువారం విధులకు వెళ్లిన రాజశేఖర్‌రెడ్డి శుక్రవారం ఉదయం ఇంటికి రాలేదు. దీంతో మృతుడి తండ్రి బాల్‌రెడ్డి కుమారుడికి ఫోన్‌ చేసినా సమాధానం రాలేదు. కాసేపటికి అదే గ్రామానికి చెందిన బట్టల జైపాల్‌రెడ్డి మీకుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రికి చెప్పాడు. దీంతో ఆయన గ్రామస్తులతో కలిసి ప్లాంట్‌కు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. సోలార్‌ప్లాంట్‌లోని గదిలో ఫ్యాన్‌కు నైలాన్‌ తాడుతో ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. తన కుమారుడికి ఎలాంటి సమస్యలు లేవని ప్లాంట్‌ యాజమాన్యంపైనే అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రూరల్‌ సీఐ నగేశ్‌ ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. పట్టణంలోని జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య విశాల, కూతురు శ్రీజ, కుమారుడు భరత్‌రెడ్డి ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

అపస్మారక స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి

తాండూరు రూరల్‌: అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ గుర్తు తెలియని వ్యక్తిని కరన్‌కోట్‌ యువకులు శుక్రవారం ప్రభు త్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులుగా గ్రామంలోని బంగారమ్మ ఆలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఉంటున్నాడు. ఆయన వివరాలు తెలసుకునేందుకు యత్నించినా చెప్పలేకపోతున్నాడు. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో వడదెబ్బ తగిలి ఉంటుందని భావించిన యువ నాయకుడు శ్రీనివాస్‌ పంచాయతీ కార్మికులతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అనాథ వ్యక్తి యాలాల మండలం కోకట్‌ వాసిగా అనుమానిస్తున్నారు.

మట్టిని తరలిస్తున్న

వాహనాలు సీజ్‌

మాడ్గుల: అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలను సీజ్‌ చేసినట్లు సీఐ వేణుగోపాల్‌రావు తెలిపారు. మండల పరిధిలోని అందుగుల శివారులోని వాగు నుంచి శుక్రవారం ఉదయం అక్రమంగా మట్టి తరలిస్తుండగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులు వాహనాలను తనిఖీ చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో సీజ్‌ చేసి డ్రైవర్లు, వాహన యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఓఆర్‌ఆర్‌పై కారు బోల్తా

యువకుడి దుర్మరణం

ఇబ్రహీంపట్నం: అతివేగం కారణంగా కారు బోల్తాపడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన శుక్రవారం ఆదిబట్ల ఠాణా పరిధిలో ఔటర్‌ రింగ్‌రోడ్డుపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. యాచారం మండలం నల్లవెల్లికి చెందిన డేరంగుల తిరుమలేశ్‌(35) నగరంలోని గచ్చిబౌలి నుంచి ఓఆర్‌ఆర్‌ మీదుగా స్వగ్రామానికి ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో బొంగులూరు ఎగ్జిట్‌–12 వద్దకు రాగానే అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న తిరుమలేశ్‌ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.

యువకుడి బలవన్మరణం

షాబాద్‌: అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన షాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సతీశ్‌కుమార్‌ తెలిపిన ప్రకారం..మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన జట్ట సంగమేశ్వర్‌(22) 15 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. గురువారం తండ్రి నర్సింలు సంగమేశ్వర్‌ను మొయినాబాద్‌లోని భాస్కర్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి ఇంటికి తీసుకువచ్చాడు. ఫలితం లేకపోవడంతో మనోవేదనకు గురైన సంగమేశ్వర్‌ పొలానికి వెళ్తున్నాని చెప్పి అక్కడ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి పొలానికి వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందిన కుమారుడిని చూసి బోరులన విలపించాడు. శుక్రవారం మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

సీనియర్‌ టెక్నీషియన్‌ బలవ్మరణం 1
1/3

సీనియర్‌ టెక్నీషియన్‌ బలవ్మరణం

సీనియర్‌ టెక్నీషియన్‌ బలవ్మరణం 2
2/3

సీనియర్‌ టెక్నీషియన్‌ బలవ్మరణం

సీనియర్‌ టెక్నీషియన్‌ బలవ్మరణం 3
3/3

సీనియర్‌ టెక్నీషియన్‌ బలవ్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement